మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు పై రేవంత్ రెడ్డి ఫైర్..!

స్వతంత్ర వెబ్ డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు విమర్శలు చేశారు. ఇవాళ గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ముఖ్యంగా బిల్లా, రంగాలు నలుమూలాల చిత్త కార్తీ కుక్కలా  తిరుగుతున్నారు. ధరణి పోర్టల్ తో 10వేల ఎకరాలను సంపాదించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వేల కోట్లు దోచేశారు.  2004లో ఎమ్మెల్యే కాకుండానే కాంగ్రెస్ పార్టీ హరీశ్ రావు(బిల్లా)ను మంత్రిని చేసింది. రబ్బరు చెప్పులు ఉన్న నీకు.. విమానంలో తిరిగే పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ దయ వల్లనే అని చెప్పారు రేవంత్ రెడ్డి.

మమ్మల్నీ మరగుజ్జులు అంటారా..? కేసీఆర్ ఏమైనా బాహుబలి నా..? అద్దంలో ముఖం చూసుకోవాలి. కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ వచ్చేదా ? సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ లో అమలు చేస్తున్న పథకాలు తెలంగాణ అంతటా ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు 6 గ్యారెంటీ స్కీమ్ లు ఇచ్చామని తెలిపారు.

Latest Articles

సీబీఐతో విచారణ జరిపించాలి- యూట్యూబర్ జోసెఫ్

యూట్యూబర్ జోసెఫ్‌ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ చేపట్టనున్నారు. తనపై పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను ఒకే కేసు కింద విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని ఇప్పటికే జోసెఫ్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్