సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబును నిలదీసే దమ్ము, కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం లేదని బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సాగర్ కుడి కాల్వ నుండి రోజుకు 10 వేల TMCలు ఏపీ తరలించుకుపోతుందన్నారు. వికారమైన భాషతో విపక్షాల మీద ఎగరిపడడం కాదని.. ఏపీ, కేంద్ర ప్రభుత్వాల మీద రేవంత్ రెడ్డి ఎగిరిపడాలన్నారు. CRPF బలగాలను తొలగించి.. నాగార్జున సాగర్‌ను తెలంగాణ ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలన్నారు.
ప్రాజెక్టులకు అనుమతులు సాధించడంలో కాంగ్రెస్ విఫలం అయిందని మాజీమత్రి హరీష్‌రావు అన్నారు. కృష్ణా జలాల్లో తాత్కాలిక ఒప్పందం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ వాటా 512 టీఎంసీలు అన్నారు. కానీ ఏపీ 650 టీఎంసీల నీటిని వాడుకుందని తెలిపారు. ఏపీ నీళ్లు తరలించుకుపోతున్నా ప్రభుత్వం బెల్లం కొట్టిన రాయిలాగా ఉందని మండిపడ్డారు. తెలంగాణ సీఎం పరోక్షంగా జలదోపిడికి సహకరిస్తున్నారని విమర్శించారు.