బీఆర్ఎస్ పార్టీపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో హత్యా రాజకీయాన్ని పెంచి పోషిందన్నారు. బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించిన రాజలింగాన్ని హత్య చేశారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డే చంపించినట్లు మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారని చెప్పారు. గండ్రా వెంకటరమణారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి పోలీసులకు లొంగిపోమని చెప్పకుండా హరీశ్ రావు ప్రెస్ మీట్ పెట్టి కృష్ణా వాటర్ అంటూ డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా నదీ నీటి దోపిడీకి అసలు కారణం ఎవరు అని నిలదీశారు. వైఎస్ జగన్‌తో దోస్తానా చేసి శ్రీశైలం, నాగార్జున సాగర్ నీళ్లు దోచి పెట్టింది నువ్వే కదా అంటూ హరీష్‌రావుపై విమర్శలు గుప్పించారు.