హైడ్రా నిర్వహిస్తున్న విధులన్నింటిలో DRF బృందాల పాత్ర చాలా కీలకమైనదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజల అంచనాల మేరకు హైడ్రా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. DRFలోకి ఔట్‌సోర్సింగ్ విధానంలో కొత్తగా తీసుకున్న 357 మంది శిక్షణ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. అంబర్‌పేట్ పోలీసు శిక్షణ కేంద్రంలో వారం రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుందని చెప్పారు. ప్రకృతివైపరీత్యాలు సంభవించినప్పడు ప్రజల ప్రాణాలతో పాటు.. ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో DRF పాత్ర చాలా కీలకమైందని వివరించారు. ఇప్పుడు హైడ్రా విధులు కూడా తోడయ్యాయన్నారు.