23.7 C
Hyderabad
Tuesday, March 25, 2025
spot_img

కుట్ర చేసి వంశీచంద్‌రెడ్డిని రేవంత్‌ రెడ్డి ఓడించారు- తీన్మార్‌ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌.. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినప్పటికీ బీసీ ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు. సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్, సీఎం సిట్టింగ్ స్థానం మల్కాజ్ గిరి రెండింటిలో కాంగ్రెస్ ఓడిపోయిందని.. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎందుకు ఇంతలా వ్యతిరేకత వచ్చిందో ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. వంశీ చంద్ రెడ్డి ఏఐసీసీకి నిజాలు చెబుతారని.. కుట్ర చేసి మహబూబ్ నగర్ ఎంపీగా రేవంత్ రెడ్డి ఓడించారని ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన కుర్చీ కోసం కాంగ్రెస్‌ పార్టీని ఖతం చేసి.. వేరే పార్టీలో చెరొచ్చని ఆరోపణలు చేశారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ సస్పెండ్ నోటీసులు మీడియా ముందు ప్రదర్శించారు తీన్మార్ మల్లన్న. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీలకు రాజ్యాధికారం ఎలా రావాలో సస్పెండ్ నోటీసులతో చూపిస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తనను సస్పెండ్ చేయించాలని చాలా ప్రయత్నం చేశారని.. సస్పెండ్‌ చేసినంత మాత్రాన తీన్మార్‌ మల్లన్నకు వచ్చిన ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు. బీసీ సంఘాలు ఇచ్చిన బూస్టింగ్ భవిష్యత్‌లో మంచి రూపం వస్తుందని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి తనను కాంగ్రెస్ నుంచి బయటికి పంపడం ద్వారా.. బీసీలు ఎవరు ప్రశ్నించరు అనుకుంటే అది భ్రమే అవుతుందని అన్నారు.

కుల గణన నివేదిక తప్పు.. ఇది బీసీలను మోసం చేసే నివేదిక అని తగలబెట్టాను అని చెప్పారు. అదే తప్పయితే ఇంకో వెయ్యిసార్లు చేయడానికి తాను సిద్ధమని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన కుల గణన మంచి పనే.. కానీ భారత దేశానికి దిక్సూచి కావాలన్నారు. కుల గణన మొదటి రోజునే సీఎం,మంత్రులు ఎమ్మెల్యేలు ఇళ్లలో ఉన్నారని.. సీఎం కూడా చివరి రోజు వివరాలు ఇచ్చారని…ఇక నిర్లక్ష్యం ఉండదా..? అంటూ ప్రశ్నించారు. అగ్రవర్ణాలకు ఎక్కువ చూపి.. అణగారిన వర్గాలను తొక్కే ప్రయత్నం ఈ సర్వే ద్వారా జరిగిందని వ్యాఖ్యానించారు. తాను చెప్పింది తప్పయితే .. మళ్ళీ సర్వే ఎందుకు చేశారని నిలదీశారు. “సర్వేలో పాల్గొనని వారు 16 లక్షలు అని రేవంత్‌రెడ్డికి ఎలా తెలిసింది.. 2011 జనాభా లెక్కల ప్రకారం 3 కోట్ల 50 లక్షల పై చిలుకు..అప్పుడు 83 లక్షల ఇండ్లు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఒక కోటి 13 లక్షల ఇండ్లు పెరిగాయి అన్నారు. EWS రక్షించుకోవడానికి వేసిన ఎత్తుగడ కుల గణన. 6.85 శాతం ఉన్న ఓసీ లకు 10శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు. EWS రిజర్వేషన్ తొలగించాలని అనేక సార్లు మీకే వినతి ఇచ్చాను. బీసీ బిడ్డగా తప్పకుండా EWS రద్దు డిమాండ్ చేస్తాం”.. అని ప్రశ్నించారు

కులగణన సర్వే పై చర్చకు సిద్ధమా సీఎం రేవంత్ రెడ్డి… ఎక్కడికి రావాలో చెప్పాలని తీన్మార్‌ మల్లన్న సవాల్‌ విసిరారు. కుల గణనతో ఓసీల జనాభా ఎలా పెరిగిందో సమాధానం చెప్పాలన్నారు. 2011 జనాభా లెక్కల్లో, కుల గణన సర్వేలో ముస్లిం జనాభా 40 లక్షలు మాత్రమే ఉందని.. ముస్లింలు ఒక్కరూ కూడా పిల్లల్ని కనలేదా.. అంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ బీసీల తలలు లెక్కపెడుతా అన్నాడు కాబట్టే కాంగ్రెస్ లో తీన్మార్ మల్లన్న చేరాడు. సీఎం రేవంత్ రెడ్డి చేసే పనులతో మీ మంత్రులకు కూడా మీ పేరు గుర్తుకు రావడం లేదు. మన్మోహన్ సింగ్ తీసుకువచ్చిన ఆర్డినెన్సు రాహుల్ గాంధీ చెత్త బుట్టలో వేశారు… తీన్మార్ మల్లన్న కూడా అదే చేశారని అన్నారు.

కాంగ్రెస్ లో తనకు ఒక న్యాయం.. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి ఒక న్యాయమా అని ప్రశ్నించారు తీన్మార్‌ మల్లన్న. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం రెడ్లకేనా.. బీసీలకు లేదా..? బీసీ ఉద్యమం లేవకుండా ఉండాలనేది మీ ఉద్దేశ్యం. కేసీఆర్ పై ఒక్కడినై పోరాటం చేశాం. అందరి రెక్కల కష్టంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. 44 స్థానాల్లో తాను ప్రచారం చేస్తే.. 42 స్థానాల్లో ఎమ్మెల్యేలు గెలిచారని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో కాంగ్రెస్ బతకాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయను.. మండలిలో చర్చించాల్సినవి చాలా ఉన్నాయన్నారు తీన్మార్‌ మల్లన్న. ఇక చివరగా కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే కొంత మెరుగ్గా ఉందని చెప్పారు తీన్మార్ మల్లన్న

Latest Articles

‘మ్యాడ్ స్క్వేర్’లో ‘మ్యాడ్’ని మించిన కామెడీ ఉంటుంది: మ్యాడ్ గ్యాంగ్

బ్లాక్ బస్టర్ చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందుతోన్న 'మ్యాడ్ స్క్వేర్' కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్