రేవంత్‌పై రామేశ్వరరావు దాఖలు చేసిన పరువునష్టం దావా మళ్లీ విచారణ.. హైకోర్టు ఆదేశం

స్వతంత్ర వెబ్ డెస్క్: డీఎల్ఎఫ్ భూముల వ్యవహారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 2014లో చేసిన ఆరోపణలపై మైహోం సంస్థల అధినేత రామేశ్వరరావు దాఖలు చేసిన పరువునష్టం పిటిషన్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిబంధనలకు అనుగుణంగా ఈ పిటిషన్‌ను పరిగణనలోకి (కాగ్నిజెన్స్) తీసుకోవాలని కిందిస్థాయి కోర్టును హైకోర్టు ఆదేశించింది. కాగా అవాస్తవ విమర్శల కారణంగా తన పరువుకు భంగం వాటిల్లిందంటూ రామేశ్వరరావు రూ.90 కోట్ల మేర పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కిందిస్థాయి కోర్టు రేవంత్ రెడ్డికి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రేవంత్ రెడ్డి 2018లో హైకోర్ట్‌ను ఆశ్రయించారు. దీంతో కిందిస్థాయి కోర్టు విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ హైకోర్టు గతంలోనే ఆదేశాలు జారీచేసింది. తాజాగా తిరిగి నిబంధనలకు లోబడి రామేశ్వరరావు పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.

కాగా.. రేవంత్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టులో కీలక వాదనలు జరిగాయి. రామేశ్వరరావు పిటిషన్‌ను పిటిషన్‌కు పరిగణలోకి తీసుకోవడానికి కారణాలు చెప్పాలని రేవంత్ రెడ్డి లాయర్లు వాదించారు. లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేయకుండానే మేజిస్ట్రేట్ పరిగణలోకి తీసుకోవడం చెల్లుబాటుకాదని వినిపించారు. ఇందుకు సంబంధించి దేశ సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలు ఉన్నాయని ప్రస్తావించారు. అయితే కిందిస్థాయి కోర్టు పరిగణనలోకి తీసుకోవడం చట్టబద్ధమేనని రామేశ్వరరావు తరపు లాయర్లు వాదించారు. చివరిగా ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. పరిగణనలోకి తీసుకుంటున్నట్టు నోటీసులు ఉండాలని తెలిపింది. గత ఉత్తర్వులను రద్దు చేస్తున్నామని, మళ్లీ ప్రొసీడింగ్స్ నిర్వహించేందుకు కేసును దిగువస్థాయి కోర్టుకు అప్పగిస్తున్నట్టు ఆదేశాలిచ్చింది. దీంతో పరువునష్టం దావాపై విచారణ మళ్లీ మొదలుకానుంది.

Latest Articles

నాని లైనప్ మారిందా..?

నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్