ఏపీలో డీబీటీ పథకాలకు నిధుల విడుదల ప్రారంభమైంది. నిన్న ఒక్కరోజే ఆసరాకు 1480 కోట్లు నిధులు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు 502 కోట్లు విడుదల చేసింది. మిగిలిన పథకాలకూ నిధులు విడుదల కానున్నాయి. రెండు మూడు రోజుల్లో నిధుల విడుదలను ప్రభుత్వం పూర్తి చేయనుంది. టీడీపీ ఫిర్యాదులతో పోలింగ్‌కు ముందు డీబీటీ నిధుల విడుదలకు బ్రేక్ పడింది. డీబీటీ క్రింద నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు విధించింది. పోలింగ్ సమయం వచ్చేంతవరకూ అనుమతిపై ఈసీ ఎటూ తేల్చకపోవడంతో… ఎన్నికల సంఘం తీరుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఇప్పుడు నిధుల విడుదల ప్రారంభం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
ఏపీలో డీబీటీ పథకాలకు నిధుల విడుదల
0
316
Previous article
Next article
Latest Articles
నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అవినీతి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో, కార్యాలయంలో ఒకేసారి తనిఖీలు...
- Advertisement -
- Advertisement -


