నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పాపులర్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ’. సీజన్ సీజన్‌కు ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ పెంచేస్తూ సెలబ్రిటీలతో సందడి చేస్తున్నారు బాలయ్య. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకేలో బాలకృష్ణతో సందడి చేశారు అల్లు అర్జున్. సీజన్ 4లో ఎపిసోడ్ 5లో వన్ ఆఫ్ ది గెస్ట్‌గా, కుమారుడు అల్లు అయాన్, కూతురు అల్లు అర్హతో కలిసి హాజరయ్యాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో కూడా వైరల్ అవుతోంది.
ఈ షోలో అ్లలు అర్హను తెలుగు వచ్చా అమ్మ అని అడిగితే.. దీనికి అల్లు అర్జున్ స్పందిస్తూ.. తెలుగు రావటమా.. అని పద్యం పాడు అని తన కూతురు చెవిలో చెప్తాడు. దీనికి మను చరిత్రలోని అల్లసాని పెద్దన రచించిన ‘అటజని కాంచె’ పద్యం చెప్పిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అలాగే తన కుమారుడు యానిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్‌లా తండ్రి కోసం ఆరాటపడతాడని అయాన్ గురించి అల్లు అర్జున్ చెప్పడం కూడా ఫ్యాన్స్‌లో జోష్ పెంచింది. తాజాగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అల్లు అయాన్, అర్హ, అల్లు అర్జున్ సరదా చిట్‌చాట్, ఆటపాటాకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఈ ఎపిసోడ్ సరికొత్త రికార్డులతో వ్యూవ్స్ పరంగా దూసుకెళ్తోందని ఆహా పేర్కొంది.