సుహాస్ ‘జనక అయితే గనక’కు ప్రభాస్ సపోర్ట్

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ నుంచి వస్తున్న సినిమాలు కంటెంట్ పరంగా కొత్తగా ఉండటం, ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ ఉండటం గమనిస్తూనే ఉన్నాం. ఈ బ్యాన‌ర్‌పై వ‌చ్చిన బ‌లగం ఎంత సెన్సేష‌న‌ల్ స‌క్సెస్‌ను సొంతం చేసుకుందో అంద‌రికీ తెలిసిందే. ల‌వ్ మీ వంటి డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీ త‌ర్వాత ఈ బ్యాన‌ర్‌పై వ‌స్తోన్న చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత ఈ సినిమాను నిర్మించానారు. వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ సుహాస్ హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని సందీర్ రెడ్డి బండ్ల తెరకెక్కించారు.

ఆల్రెడీ ఇప్పటి వరకు వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా టీజర్‌ను చిత్రయూనిట్ వదిలింది. డార్లింగ్, రెబల్ స్టార్ ప్రభాస్ ఈ టీజర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ‘ఆ ఒక్క నిర్ణయం నా లైఫ్‌ను మార్చేసింది’.. ‘నేను ఒక వేళ తండ్రినైతే.. నా పెళ్లాన్ని సిటీలో ఉన్న బెస్ట్ హాస్పిటల్‌లో చూపించాలి.. నా పిల్లల్ని బెస్ట్ స్కూల్‌లో చేర్పించాలి.. మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి.. బెస్ట్ జీవితాన్ని ఇవ్వాలి.. బెస్ట్ ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనకూడదు’.. అనే డైలాగ్స్.. హీరో ఫ్రస్ట్రేషన్, మిడిల్ క్లాస్ లైఫ్ కష్టాలను ఎంతో ఫన్నీగా చూపించారు. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ఇలా అన్ని అంశాలు సరైన పాళ్లలో ఉన్నాయని ఈ టీజర్ చూస్తే తెలుస్తోంది.

సాయి శ్రీరామ్ సినిమాటోగ్ర‌ఫీ, విజ‌య్ బుల్గానిన్ సంగీతం టీజర్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ మూవీని త్వ‌ర‌లోనే రిలీజ్ చేయబోతోన్నారు.

నటీనటులు – సుహాస్, సంగీత్, రాజేంద్రప్రసాద్, గోపరాజు రమణ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : దిల్ రాజు ప్రొడక్షన్స్
సమర్పణ: శిరీష్
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి
రచన & దర్శకత్వం: సందీప్ బండ్ల
సంగీతం: విజయ్ బుల్గానిన్
డీఓపీ : సాయి శ్రీరామ్
ఎడిటర్ : కోదాటి పవన్ కళ్యాణ్
ప్రొడక్షన్ డిజైనర్ : అరసవిల్లి రామ్ కుమార్
కాస్ట్యూమ్ డిజైనర్ : భరత్ గాంధీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అకుల్
PRO : వంశీ కాకా

Latest Articles

నాని లైనప్ మారిందా..?

నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్