నిహారికకు వెల్కమ్ చెప్పిన గీతా ఆర్ట్స్

కంటెంట్ క్రియేటర్‌గా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన నిహారిక ఎన్ఎం గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్న సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఈ రోజు ఆమె బర్త్ డే సందర్భంగా విషెస్ అందిస్తూ టాలీవుడ్‌లోకి వెల్కమ్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది గీతా ఆర్ట్స్ సంస్థ. చెన్నైలో పుట్టిన నిహారిక బెంగళూరులో పెరిగింది. యూఎస్ కాలిఫోర్నియాలోని చాప్ మాన్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసింది. థియేటర్ ఆర్ట్స్ మీద చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉన్న నిహారిక తన పదో తరగతిలో యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. వివిధ అంశాలపై తన అభిప్రాయాలు తెలిపేలా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ సబ్ స్క్రైబర్స్ ను ఆకట్టుకుంటుంది.

క్రమంగా సోషల్ మీడియాలో ఎంటర్ టైన్ మెంట్, కామెడీ క్వీన్ గా పేరు తెచ్చుకుంది. నిహారికకు సోషల్ మీడియాలో 6 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఇటీవల యూట్యూబ్ ఆధ్వర్యంలో జరిగిన క్రియేటర్స్ ఫర్ ఛేంజ్ కార్యక్రమంలో ఇండియా నుంచి వరుసగా రెండోసారి రిప్రజెంట్ చేసింది. కొన్ని ముఖ్యమైన సామాజికాంశాలపై అవేర్ నెస్ తెచ్చేలా నిహారిక కంటెంట్ క్రియేట్ చేస్తోంది. తను చదువుకున్న యూఎస్ కాలిఫోర్నియా చామ్ మాన్ యూనివర్సిటీలో నిహారిక ఎన్ఎం కెరీర్ లో ఎదిగిన విధానంపై కేస్ స్టడీ చేస్తుండటం విశేషం. టాలీవుడ్ లో కూడా నిహారిక ఎన్ఎంకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని అనుకోవచ్చు.

Latest Articles

మీనాక్షి సెంటిమెంట్ మళ్లీ నిజమయ్యేనా..?

ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినీ జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో మీనాక్షి సెంటిమెంట్ ఒకటి ఉంది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్