‘నరకాసుర’లోని సాంగ్ లాంచ్ చేసిన అనిల్ రావిపూడి

పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న సినిమా ‘నరకాసుర’. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్‌లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో నరకాసుర మూవీ రిలీజ్ కాబోతోంది.

తాజాగా నరకాసుర చిత్రం నుంచి ‘నిన్ను వదిలి’ అనే లిరికల్ సాంగ్‌ను స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. పాట చాలా బాగుందన్న ఆయన మూవీ టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. తమ సినిమాలోని నిన్ను వదిలి పాటను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడికి నరకాసుర టీమ్ కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీరామ్ తపస్వి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను ఏఐఎస్ నాఫాల్ రాజా బ్యూటిఫుల్ కంపోజిషన్‌లో విజయ్ ప్రకాష్, చిన్మయి శ్రీపాద హార్ట్ టచింగ్‌గా పాడారు. ‘నిన్ను వదిలి నేనుండగలనా..నన్ను వదిలి నీవుండగలవా..ఇది నీ వాంఛ గాదే, నాకు ఏ వాంఛ లేదే..పంచభూతమ్ములు అనుకున్నా..విధిని ఆపవులే..’అంటూ ప్రేమలోని ఎమోషనల్ బాండింగ్ చూపిస్తూ సాగుతుందీ పాట. అందమైన ఈ పాటను అంతే అందంగా పిక్చరైజ్ చేసినట్లు లిరికల్ సాంగ్‌లోని విజువల్స్ ద్వారా తెలుస్తోంది.

నటీనటులు – రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్, శతృ, నాజర్, చరణ్ రాజ్, తేజ చరణ్ రాజ్, శ్రీమాన్, గాయత్రి రవిశంకర్ తదితరులు

సాంకేతిక నిపుణులు :

బ్యానర్స్ : సుముఖ క్రియేషన్స్ అండ్ ఐడియల్ ఫిల్మ్ మేకర్స్
నిర్మాత : డాక్టర్ అజ్జా శ్రీనివాస్
ఎడిటింగ్ : సిహెచ్ వంశీకృష్ణ
సినిమాటోగ్రఫీ : నాని చమిడిశెట్టి
సంగీతం : ఏఐఎస్ నాఫాల్ రాజా
యాక్షన్ : రోబిన్ సుబ్బు
పిఆర్ఓ : జీఎస్ కే మీడియా
రచన, డైరెక్షన్ : సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్