Rain Alert |రెండు రోజుల పాటు వర్షాలు.. రైతులకు వాతావరణ శాఖ హెచ్చరిక..

Rain Alert |ఓ వైపు ఎండ వేడిమితో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ద్రోణి ప్రభావంతో రెండు రోజుల పాటు తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఉమ్మడి వ‌రంగ‌ల్, న‌ల్లగొండ‌, ఖ‌మ్మం జిల్లాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మూడు జిల్లాల‌కు వాతావ‌ర‌ణ శాఖ ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల ప్రజ‌లు అప్రమ‌త్తంగా ఉండాల‌ని హెచ్చరించింది. ఈ జిల్లాల‌తో పాటు రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. గంట‌కు 30 – 40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉన్నట్లు వెల్లడించింది.

Rain Alert |ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైతులు అప్రమ‌త్తంగా ఉండాల‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరించింది. అటు ఏపీలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం ఉండగా.. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మినహిస్తే మిగిలిన చోట్ల వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని.. వర్షాల సమయంలో బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.

Read Also: వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌ కు మరో స్వర్ణం.. చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి..

Follow us on:   Youtube ,  Instagram 

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్