AP Edcet |ఏపీలో ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..

AP Edcet |ఆంధ్రప్రదేశ్‌ లోని బిఈడీ కళాశాలల్లో 2023-24 విద్యాసంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఎడ్‌సెట్‌ 2023 ప్రకటన వెలువడింది. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని ఏపీ ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ఆచార్య కె రాజేంద్రప్రసాద్‌ సూచించారు. ఈ ఏడాది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏపీ ఎడ్‌సెట్‌ ప్రవేశాలను నిర్వహిస్తోంది. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునేవారికి లేదా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయాలంటే బిఈడీ తప్పనిసరి. డిగ్రీ పూర్తి చేసిన వారు బిఈడీ కోర్సు చేసేందుకు అర్హులు. ఎడ్ సెట్ దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన వివరాలు చూస్తే.. ఏప్రిల్‌ 23 వరకు ఎటువంటి ఆలస్య రుసుము చెల్లించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ అభ్యర్ధులకు రూ.650, బీసీ అభ్యర్ధులకు రూ.500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకురూ.450లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వెయ్యి రూపాయిల ఆలస్య రుసుముతో మే 2వ తేదీ వరకు, 2వేల రూపాయల ఆలస్య రుసుముతో మే 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

హాల్ టికెట్లు మే 12 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (AP EDCET 2022) పరీక్ష మే20 తేదీన ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ మే 24న విడుదల చేస్తారు. బీఏ/బీఎస్సీ/బీకాం/బీసీఏ/బీబీఎం కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తివివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించవచ్చు. లేదా ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకునే పేజీని సందర్శించవచ్చు.

Read Also:  గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌కు ఉచిత కోచింగ్‌.. దరఖాస్తు చేసుకోండిలా..

Follow us on:   Youtube ,   Instagram

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్