రాయ్ బరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్

     రాయ్‌బరేలీ కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థిగా పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ కాసేపట్లో నామినేషన్‌ వేయను న్నారు. రాహుల్‌ గాంధీతో పాటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ అమేథీ ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాయ్‌ బరేలీ బయల్దేరారు. నామినేషన్‌కు ముందు భారీ రోడ్‌ షోకు ప్లాన్‌ చేశారు. అనంతరం నామినేషన్‌ వేస్తారు రాహుల్‌ గాంధీ

   రాహుల్‌ గాంధీ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కాసేపట్లో రాయ్‌ బరేలీ చేరుకుంటారు. ఉదయం రాయ్ బరేలీ వెళ్తున్న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే .. హైదరాబాద్ బేగంపేట్ లో ఆగారు. రేవంత్‌ రెడ్డితో కలిసి ఒకే విమానంలో రాయ్ బరేలి వెళ్లారు. రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను ఈ ఉదయం ప్రకటించింది కాంగ్రెస్‌. రాయ్‌ బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ బరిలో దిగుతున్నారని… అమేథీ నుంచి కాంగ్రెస్‌ నేత కిషోరీ లాల్‌ శర్మ పోటీ చేస్తున్నట్లు ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. 2004, 2019 లోక్‌సభకు అమేథీ నుండి ప్రాతినిధ్యం వహించిన రాహుల్ గాంధీ తన కుటుంబ కంచుకోట అయిన రాయ్ బరేలీ నుండి నామినేషన్ పత్రాలను ఇవాళ దాఖలు చేయనున్నారు. సోనియా గాంధీ 2004 , 2024లో రాయ్ బరేలీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. ఈ ఏడాది ఆమె రాజ్యసభకు వెళ్లారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆమె ఈ సారి కూడా పోటీకి దూరంగా ఉన్నారు.

    ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ స్థానం నుంచి కాంగ్రెస్‌ నేత కిషోరి లాల్‌ శర్మ లోక్‌సభ ఎన్నికల నామినేషన్‌ దాఖలు చేయను న్నారు. 2019 వరకు ఈ నియోజకవర్గం గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉంది. కాంగ్రెస్ దిగ్గజం రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఇక అమేథీ నుంచి పోటీ చేస్తున్న కిషోరి లాల్ శర్మ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. అమేథీలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో సన్నిహితంగా పనిచేశారు. రాయ్‌బరేలీలో సోనియా గాంధీ ప్రతినిధిగా కూడా ఉన్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్