ఈనెల 18వ తేదీన తెలంగాణకు రాహుల్ గాంధీ

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో ఎలాగైనా కర్ణాటక ఫలితాలు రిపీట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ దిశగా కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఇప్పుడు ఈ గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో పడింది. ఇందుకోసం 119 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీని ద్వారా ఇప్పటివరకు ప్రకటించిన యువ డెక్లరేషన్, వ్యవసాయ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, చేయూత పెన్షన్ పథకం, 6 హామీల గ్యారెంటీ కార్డు జనంలోకి తీసుకెళ్లనున్నారు. రోజుకు ఐదు నుంచి ఆరు నియోజకవర్గాలలో బస్సు యాత్ర చేపట్టేందుకు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. కార్నర్ సమావేశాలు నిర్వహణకు అనువైన ప్రదేశాలను ఎంపిక చేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ బస్సు యాత్రలో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ , మల్లికార్జున ఖర్గేలతోపాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, స్టార్ క్యాంపెయినర్లు  కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. ఈ నెల 14, 15 తేదీలలో ప్రియాంక గాంధీ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఈనెల 18, 19, 20 తేదీల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్