కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధానిపై మరోసారి ఫైరయ్యారు. ఆర్థిక తుఫాన్ రాబోతోందని హెచ్చరిస్తూనే ఉన్నానని.. కానీ మోదీ ఎప్పటిలాగే ఎన్నికలతో బిజీగా ఉన్నారని అన్నారు. ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలు 8 రూపాయలు పెంచారని చెప్పారు.
ధరల పెంపు ఇంకా కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ద్రవ్యోల్భణ సూత్రధారి మోదీకి ఉన్నది ఒకటే పని.. ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేయడం..ఎన్నికలు ముగిశాక ప్రజల జేబులపై దాడులు చేయడం అని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ధరల పెంపు కొనసాగుతూనే ఉంటుంది- రాహుల్ గాంధీ
Latest Articles
- Advertisement -


