అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చీటీల స్కాంపై డీఎస్పీ ఆఫీసు వద్ద ప్రజలు ఆందోళన చేపట్టారు. అమ్మినేని వీధిలో ఉండే సుధాకర్ రెడ్డి చీటీల పేరుతో కోట్లల్లో దోచేశాడని బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ మదనపల్లె DSP ఆఫీస్ ఎదుట ఆందోళన చేశారు. సుధాకర్ రెడ్డి కోట్లల్లో చీటీ డబ్బు కట్టించుకుని తిరిగి తమకు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని బాధితులు ఆరోపిం చారు. డబ్బు తిరిగి ఇవ్వమని అడగ్గా తమపైనే దాడులు చేయిస్తూ… చంపుతామని బెదిరిస్తు న్నారని వారి ఆవేదన వ్యక్తం చేశారు. సుధాకర్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. విచారన చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని డీఎస్పీ ప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు.
మదనపల్లెలో డీఎస్పీ ఆఫీసు వద్ద ప్రజల ఆందోళన
0
403
Previous article
Next article
Latest Articles
సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -
- Advertisement -


