స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్- ఎ- ఇన్సాఫ్(PTI) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట లభించింది. అల్ ఖాదీర్ ట్రస్ట్ కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు ఆయనకు రెండు వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది. మే 9వ తేదీ తర్వాత ఇమ్రాన్ కు వ్యతిరేకంగా దాఖలైన ఏ కేసుల్లోనూ ఇమ్రాన్ ను అరెస్ట్ చేయడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు విచారణ నేపథ్యంలో ఇమ్రాన్‌కు సంఘీభావంగా పెద్దఎత్తున అభిమానులు చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ఆయన్ను కోర్టులో హాజరుపర్చారు. కాగా ఇదే కేసులో మంగళవారం ఇమ్రాన్ ఖాన్‌ను పాక్ ఆర్మీ రేంజర్లు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఇమ్రాన్ మద్దతుదారులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇమ్రాన్ అరెస్టు అక్రమమని ప్రకటిస్తూ తక్షణమే ఆయన్ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట
0
379
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


