స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీచేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. ఎన్నికల తర్వాత వచ్చే సీట్లను బట్టి సీఎం ఎవరనే నిర్ణయం ఉంటుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన ముందున్న ఏకైక లక్ష్యమని పేర్కొన్నారు. త్రిముఖ పోటీలో మరోసారి బలి కావడానికి సిద్ధంగా లేనని పవన్ వ్యాఖ్యానించారు. సీఎం పదవి తనకు దక్కాలంటే తనను గెలిపించి సముచిత స్థానం కల్పించాలని జనసేన కార్యకర్తలను కోరారు. వైసీపీ ప్రభుత్వం అక్రమాలు, అరాచకాలపై పోరాడదామని ఆయన పిలుపునిచ్చారు. అలాగే జనసేనలో ఉంటూ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడినా పార్టీ నుంచి బహిష్కరిస్తామని జనసేనాని హెచ్చరించారు.
బిగ్ బ్రేకింగ్: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఖాయం-పవన్
0
307
Previous article
Next article
Latest Articles
బీజేపీ జాతీయ కార్యవర్గంలో కీలక మార్పులు… బీజేపీ మాస్టర్ ప్లాన్
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గంలో అనూహ్యమైన, కీలకమైన సంస్థాగత మార్పులు చోటుచేసుకున్నాయి. ఊహించని రీతిలో పలువురు సీనియర్ నాయకులకు జాతీయ బృందంలో సముచిత స్థానం దక్కగా, మరికొందరిపై అధిష్టానం వేటు వేసింది....
- Advertisement -
- Advertisement -


