పవన్‌ కళ్యాణ్‌, మహేశ్‌బాబుపై నిర్మాత వివాదాస్పద వ్యాఖ్యలు

సినీ ఇండస్ట్రీలో హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువ వస్తుంటాయి. 100 శాతంలో కేవంల 10 శాతం సక్సెస్ రేటు ఉన్న ఇండస్ట్రీ సినీ పరిశ్రమ. అయినా సరే ఒక ప్యాషన్, కలలతో భారీ బడ్జెట్ పెట్టి మరీ సినిమాలు చేస్తుంటారు. అలా అప్పట్లోనే భారీగా ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశారు నిర్మాత శింగనమల రమేష్ బాబు. 2010లో పవన్ కళ్యాణ్‌తో కొమురం పులి, మహేష్ బాబుతో ఖలేజా సినిలు నిర్మించారు రమేష్. అయితే ఈ రెండు చిత్రాలు డిజాస్టర్ కావడంతో అప్పటి నుంచి సినిమాలకి దూరమయ్యారు.

చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన నిర్మాత శింగనమల రమేష్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖలేజా, కొమరం పులి ఈ చిత్రాల గురించి శింగనమల రమేష్ మాట్లాడుతూ.. ఆ రెండు సినిమాల వల్ల తాను 100 కోట్లు నష్టపోయినట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తనను పట్టించుకోలేదని, కనీసం అయ్యో పాపం అని కూడా అనలేదని చెప్పారు. ఈ రెండు చిత్రాలు మూడేళ్ళ పాటు డిలే అవుతూ వచ్చాయని, అంత భారీ స్థాయి నష్టాలకు కారణం ఈ రెండు చిత్రాల చిత్రీకరణకు 3 ఏళ్ళ సమయం పట్టడమేనని రమేష్ బాబు వెల్లడించారు.

సాధారణంగా రాజమౌళి, శంకర్ చిత్రాలకు అంత టైం పడుతుందని, కానీ కొమరం పులి, ఖలేజా చిత్రాలకు అంత టైం పట్టడం వల్ల తనపై వడ్డీల భారం కూడా పెరిగిందని రమేష్ చెప్పారు. అంతలా షూటింగ్ డిలే కావడానికి కారణాలు చెబుతూ పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ టైంలో ప్రజారాజ్యం పార్టీ వల్ల పవన్ కళ్యాణ్ కొమరం పులి చిత్రాన్ని గాలికి వదిలేశారని తెలిపారు. దానితో పాటు ఇంకా చాలా కారణాలు ఉన్నాయని, ఖలేజా ఆలస్యం కావడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయని రమేష్ తెలిపారు.

రమేష్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కామెంట్లపై పవన్ కళ్యాణ్‌ వీరాభిమాని, నిర్మాత బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు. రమేష్‌ని ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు.”శింగనమల రమేష్ గారు మీరు సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు. మీ కోసం పవన్ కళ్యాణ్ గారు మూడు సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని వందల కాల్షీట్స్ వేస్ట్ చేసుకున్నారు. దానికి ప్రత్యక్ష సాక్షి నేనే. దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి ఇది కరెక్ట్ కాదు.” అంటూ బండ్ల సలహా ఇచ్చారు. ఇక బండ్ల గణేష్ ట్వీట్‌కి ఫ్యాన్స్ థాంక్స్ చెబుతున్నారు. పవన్‌పై ఈగ కూడా వాలనివ్వరు బండ్ల గణేష్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తంగా శింగనమల రమేష్ చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చి కొత్త వివాదానికి తెర లేపారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్