దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ ప్రక్రియ 6గంటలకు ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు 57.70 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. నార్త్-ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 52.73శాతం పోలింగ్ నమోదుకాగా.. న్యూఢిల్లీలో అత్యల్పంగా 43.1శాతం పోలింగ్ రికార్డైంది.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం ఆతిశీ, కేంద్ర మంత్రి జై శంకర్ సహా పలువురు ప్రముఖులు తొలి గంటల్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తమిళనాడులోని ఈరోడ్(ఈస్ట్), ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిల్కిపుర్‌లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈరోడ్ ఈస్ట్ ఎమ్మెల్యే ఈవీకేఎస్ ఇళంగోవన్ మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయోధ్య జిల్లాలోని మిల్కిపుర్‌లో ఉప ఎన్నికను సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.