ఎన్నికల సిత్రాలు.. దోశెలు వేసిన ప్రియాంక గాంధీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారంలో బిజీ అయిపోయారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ మైసూరులో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న మైలారి అగ్రహార రెస్టారెంట్‌​కు వెళ్లారు. అనంతరం కిచెన్ లోకి వెళ్లి స్వయంగా పిండిని కలిపి దోశెలు వేశారు. అనంతరం రెస్టారెంట్ లో ఉన్న చిన్నారులతో సరదాగా గడిపారు.

ఈ వీడియోను ట్విటర్ లో షేర్ చేసుకున్న ప్రియాంక గాంధీ.. లెజెండరీ మైలారి రెస్టారెంట్ యజమానులతో కలిసి దోసెలు వేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రియాంక వెంట కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఆ రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ రణ్ దీప్ నూర్జేవాలా ఉన్నారు. కాగా మే 10న జరగనున్న ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామనే ధీమాలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది.

Latest Articles

తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత

తిరుపతి జిల్లా: తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్