గెట్ రెడీ.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈజ్ లోడింగ్..

పవర్ స్టార్ అభిమానులకు మైత్రీ మూవీ మేకర్స్ సూపర్ అప్డేట్ ఇచ్చింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ హీరోగా ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ సినిమా తెరకెక్కతుండగా.. మూవీకి సంబంధించిన ఎడిటింగ్ పనులు ప్రారంభమైనట్లు తెలిపింది. ఎడిటింగ్ రూంలో డైరెక్టర్ హరీశ్, నిర్మాత నవీన్ పూజలు చేస్తున్న ఫోటోలను ట్వీట్ చేసింది. ఇప్పటికే ప్రధాన తారాగణంపై మొదటి షెడ్యూల్ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాలో లేటెస్ట్ యంగ్ బ్యూటీ శ్రీలీల పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత పవన్, హరీశ్ కలయికలో ఈ చిత్రం రానుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కాంబినేషన్ అనౌన్స్ చేసిన దగ్గరి నుంచి ఈ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. తమ హీరోకు మళ్లీ ‘గబ్బర్ సింగ్’ లాంటి హిట్ కావాలని కోరుకుంటున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

 

Latest Articles

వరంగల్ మేయర్‌ పీఠంపై బండి సంజయ్‌ ఫోకస్‌.. జీహెచ్‌ఎంసీలో ప్రచారం లేనట్టేనా?

హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్