ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. జగనన్న వసతి దీవెన నిధుల పథకం కోసం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకుని.. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా నార్పల చేరుకున్నారు. మళ్లీ నార్పల నుంచి పుట్టపర్తికి వెళ్లాల్సి ఉండగా.. సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఆయన రోడ్డు మార్గం ద్వారా పుట్టపర్తి చేరుకున్నారు. గతంలోనూ కొన్నిసార్లు జగన్ ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. కాగా అంతకుముందు నార్పలలో జగనన్న వసతి దీవెన పథకం ద్వారా 9లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.912 కోట్ల డబ్బులు విడుదల చేశారు.
ఏపీ సీఎం జగన్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం
0
295
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


