భారత్​కు 100 పతకాలు.. దేశం గర్వపడేలా చేశారంటూ ప్రధాని ట్వీట్

స్వతంత్ర వెబ్ డెస్క్: ఆసియా గేమ్స్​లో భారత్ హిస్టరీ క్రియేట్ చేసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఆటల్లో సత్తా చాటుతోంది. ఎన్నో ఏళ్లుగా ఆసియా గేమ్స్​లో 100 పతకాల కల గంటున్న భారత్​ కు నేడు ఆ కల నెరవేరింది. ఆసియా క్రీడల్లో హిందుస్థాన్ 100 పతకాలు గెలుచుకుంది. ఒక్క ఈరోజే మూడు గోల్డ్ మెడల్స్ సాధించింది. దీంతో ఈ క్రీడల్లో ఇండియా గెలుచుకున్న బంగారు పతకాల సంఖ్య 25కు చేరింది. 35 రజత పతకాలు.. 40 కాంస్య పతకాలను భారత్ అథ్లెట్లు సాధించారు. ఈ పోటీలు ముగియడానికి మరో రోజు ఉండటంతో భారత్ ఇంకా పతకాలు సాధించే అవకాశం ఉంది.

ఆసియా క్రీడల్లో భారత్ 100 పతకాలు సాధించడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఇంతటి ఘనత అందుకున్న భారత అథ్లెట్లకు మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఎప్పుడెప్పుడు వారిని కలిసి అభినందించాలని ఉత్సాహంగా ఉందని ట్వీట్ చేశారు. దేశానికి చారిత్రక విజయాలను అందించిన అథ్లెట్లకు కృతజ్ఞతలు చెప్పారు. ఈనెల 10వ తేదీన ఆసియా క్రీడల్లో రాణించిన క్రీడాకారుల బృందానికి ఆతిథ్యమిచ్చి వారితో ముచ్చటించడానికి ఎదురుచూస్తున్నానని మోదీ ట్విటర్​లో రాసుకొచ్చారు

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్