స్వతంత్ర వెబ్ డెస్క్: క్యాసినో సింగ్‌గా అందరి దృష్టిలో నిలిచిన చీకోటి ప్రవీణ్ కుమార్ బీజేపీలో చేరారు. బర్కత్‌పూరలోని బీజేపీ కార్యాలయంలో చీకోటివెళ్లి పార్టీలో చేరారు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చీకోటి ప్రవీణ్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కాగా చికోటి ప్రవీణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలోనే చీకోటి బీజేపీలో చేరాలనుకున్నారు. ఇందుకు బీజేపీ ఆఫీస్‌కు తన అనుచరులతో వెళ్తే పార్టీలో చేర్చుకునేందుకు నేతలు నిరాకరించారు. కండువా కప్పేందుకు పార్టీ ఆఫీస్‌లో ఎవరు లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. తాజాగా చికోటి ప్రవీణ్‌కు బీజేపీ అగ్ర నాయకత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా జోక్యంతో చీకోటికి లైన్ క్లియర్ అయ్యింది. ప్రవీణ్‌ను పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ రాష్ట్రనాయకత్వానికి అమిత్ షా ఆర్డర్ వేశారు. అయితే చీకోటిని బీజేపీలో చేర్చుకోవడం కిషన్ రెడ్డికి ఇష్టం లేకపోవడంతో డీకే అరుణ సమక్షంలో చేరారు.