Mr Pregnant: సోహైల్ కోసం రంగంలోకి మైత్రీ మూవీ మేకర్స్

‘బిగ్ బాస్’ ఫేం సయ్యద్ సోహైల్, రూపా కొడవాయుర్ జంటగా నటిస్తున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 18న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రముఖ పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా నైజాంలో విడుదల కాబోతోంది. ఈ సినిమా నైజాం హక్కులను మంచి రేట్‌కు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంది. ఇలాంటి ఫేమస్ సంస్థ ద్వారా తమ సినిమా గ్రాండ్‌గా విడుదలవుతుండటం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ టీమ్‌లో సంతోషాన్ని కలిగిస్తోంది.

మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. ఇటీవల కింగ్ నాగార్జున చేతుల మీదుగా రిలీజ్ చేసిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అలాగే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు వంటి ప్రతి కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. పర్పెక్ట్ రిలీజ్‌తో అన్ని సెంటర్స్ ఆడియెన్స్‌కు రీచ్ కాబోతోంది ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా.

సొహైల్, రూపా కొడువయుర్, సుహాసినీ మణిరత్నం, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష, స్వప్నిక, అభిషేక్ రెడ్డి బొబ్బల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – నిజార్ షఫీ, సంగీతం – శ్రావణ్ భరద్వాజ్, ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి, ఆర్ట్ – గాంధీ నడికుడికర్, బ్యానర్ – మైక్ మూవీస్, పీఆర్వో – జీఎస్కే మీడియా, నిర్మాతలు – అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి. రచన-దర్శకత్వం – శ్రీనివాస్ వింజనంపాటి.

Latest Articles

నాని లైనప్ మారిందా..?

నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్