కన్నీళ్లు తెప్పిస్తున్న ప్రవల్లిక సూసైడ్ లెటర్

స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాదులో గ్రూప్-2కు ప్రిపేర్ అవుతున్న ప్రవల్లిక రాసిన సూసైడ్ నోట్ కన్నీళ్లు తెప్పిస్తోంది. ‘నన్ను క్షమించండి అమ్మా! నేను చాలా నష్టజాతకురాలిని. నావల్ల మీరు బాధపడుతూనే ఉన్నారు. ఏడవకండి అమ్మా. జాగ్రత్తగా ఉండండి. మీకు పుట్టడం నా అదృష్టం. నన్ను కాళ్లు కింద పెట్టకుండా చూసుకున్నారు. మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా. నన్ను ఎవరూ క్షమించరు. మీ కోసం నేను ఏం చేయలేకపోతున్నా’ అని లేఖ రాసి తనువు చాలించింది. ఇది ఇలా ఉండగా, ప్రవల్లిక ఆత్మ ఘోష…సీఎం కేసీఆర్ చెవికి వినబడటం లేదా అని పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి ఫైర్ అయ్యారు. అశోక్ నగర్ లో ఆత్మహత్య చేసుకున్న ఆడబిడ్డ ప్రవల్లిక సంఘటనపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. అశోక్ నగర్ లో ఆత్మహత్య చేసుకున్న ఆడబిడ్డ ప్రవల్లిక తరపున న్యాయం కావాలని వేల గొంతులు నినదిస్తున్నా, కేసీఆర్ చెవికి వినబడటం లేదని మండిపడ్డారు.

Latest Articles

ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్‌

కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్