లైంగిక ఆరోపణల కేసులో హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సిట్ కస్టడీలోకి తీసుకోనుంది. ఇవాళ్టి నుంచి జూన్ 6 వరకు కస్టడీలో విచారించనుంది. అశ్లీల వీడియోల కేసులో ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు కస్టడీ విధించింది. సిట్ కస్టడీలో నిజానిజాలను రాబట్టనుంది. అశ్లీల వీడియోల కేసు లో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ తన నియోజకవర్గం హాసనలో ఎన్నిక ముగియగానే విదేశాలకు వెళ్లిపో యారు. దాంతో అతడిని స్వదేశానికి రప్పించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. స్వదే శానికి వచ్చి విచారణకు సహకరించాలని జేడీఎస్ పెద్దలు దేవెగౌడ, కుమార స్వామి హెచ్చరించిన నేపథ్యంలో ఈ రోజు జర్మనీ నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చిన అతడిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బెంగళూరులోని కోర్టు ముందు హాజరుపర్చారు. పోలీసులు 14 రోజుల కస్టడీ కోరగా ప్రస్తుతం కోర్టు అతడికి ఏడు రోజుల కస్టడీ విధించింది.
నేటి నుంచి సిట్ కస్టడీలో ప్రజ్వల్ రేవణ్ణ
0
218
Previous article
Next article
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


