పోస్టల్ బ్యాలెట్ రూల్స్ పై ఏపీ హైకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. సాయంత్రం 6 గంటలకు తీర్పు ఇవ్వబోతోంది హైకోర్టు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఏపీ సీఈవో ఇచ్చిన మెమోపై అభ్యంతరం తెలుపు తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది కోర్టు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు తీర్పు చెబు తామని కోర్టు తెలిపింది. పోస్టల్ బ్యాలెట్ ఓటుపై సీల్ లేకున్నా చెల్లుతుందని ఈసీ చెప్పగా.. దాన్ని సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టుకు వెళ్లింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తుది తీర్పును వాయిదా వేసింది.
ఏపీ ఎన్నికల ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ కానున్నాయి. చాలా నియోజకవర్గాల్లో టెన్షన్ ఉంది. ఈ నేపథ్యంలో అధికార వైసీపీకి పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం ఒక చాలెంజ్ గా మారింది. పోస్టల్ బ్యాలెట్ పైనే పలువురు అభ్యర్థుల భవిష్యత్తు ఆధారపడి ఉందని వైసీపీ భావిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి ఈసీ ఇచ్చిన నిబంధనల సడలింపు తమకు ఇబ్బందికరంగా మారిందన్నది వైసీపీ భావన. దీనిపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో నిబంధనల సడలింపు ఈసీ రూల్స్ కు విరుద్ధమని వైసీపీ తరుపు న్యాయవాది వాదనలు వినిపిం చారు.ఎన్నికల కమిషన్ కింద పని చేసే సీఈవో మెమో ఇవ్వడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, సీఈవో తన మెమోను మొన్న విత్ డ్రా తీసుకున్నారు. అయితే, ఈ వ్యవహారంలో ఈసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనిపై కోర్టులో వాదనలు జరిగాయి. పోస్టల్ బ్యాలెట్ పై ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, ఎలక్షన్ రూల్స్ కు విరుద్ధమని, సడలింపులు సరికాదని వాదించారు.


