పాకిస్తాన్‌లో పొల్యూషన్ బెంబేలెత్తిస్తోంది. పొల్యూషన్‌తో లాహోర్ ప్రజలు విలవిల్లాడుతున్నారు. లాహోర్ నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 1900గా ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా లాహోర్ ఉంది. నవంబర్ 17వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. పలు ఆఫీసులకు సెలవులు ప్రకటించి, రెస్టారెంట్లు మూసివేశారు. ఆటోలు, ట్యాక్సీలు, లారీలపై నిషేదం విధించారు. ప్రజలెవరూ బయటకు రావొద్దని అధికారులు చెబుతున్నారు. ఇంట్లో ఉన్నా మాస్కులు ధరించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.