26.7 C
Hyderabad
Friday, May 15, 2026
spot_img

గట్ల నర్సింగపూర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి కుటుంబ సర్వేపై ఎన్యుమరెటర్స్ వేస్తున్న స్టిక్కరింగ్ ను గట్ల నర్సింగపూర్‌లో మంత్రి పరిశీలించారు. కుల గణనపై అధికారులకు సమగ్ర వివరాలు ఇవ్వాలని, సమాచారం గోప్యత ఉంటుందని స్థానికులకు తెలిపారు. అనంతరం స్కూల్ కి వెళ్తున్న విద్యార్థులతో పొన్నం ప్రభాకర్‌ ముచ్చటించారు.

విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు. స్థానిక కూరగాయలు అమ్మే మహిళలతో కూడా ఆయన మాట్లాడారు. వ్యాపారం ఎలా సాగుతోందని ఆరా తీశారు. అనంతరం గ్రామంలో పలు వీధుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఇటీవల మరణించిన భీమదేవరపల్లి మండల పార్టీ మాజీ అధ్యక్షులు సామల లింగమూర్తి చిత్రపటానికి మంత్రి పొన్నం నివాళులు అర్పించారు. లింగమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Latest Articles

ఎందుకు చిప్స్ ప్యాకెట్లలో గాలి నింపి ఉంటుంది? అసలు నిజం ఇదే!

మనకు ఇష్టమైన చిప్స్ ప్యాకెట్ కొనుగోలు చేసి తెరిచినప్పుడు అందులో సగం వరకు మాత్రమే చిప్స్ ఉండి, మిగతా భాగం మొత్తం గాలితో నిండిపోయి ఉండటం చూసి చాలా మందికి నిరాశ కలుగుతుంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్