Paytm UPI Lite | మొబైల్ యూజర్లకు డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం గుడ్ న్యూస్ చెప్పింది. పేటీఎం లైట్ యాప్ ను తీసుకువస్తున్నట్లు తెలిపింది. దీని ద్వారా పిన్ ఎంటర్ చేయకుండానే సులభంగా పేమెంట్స్ చేయవచ్చు. పేటీఎం వినియోగదారులు ఒక్క ట్యాప్ తో రూ.200 వరకు చెల్లింపులు చేసుకోవచ్చు. రోజుకు రెండుసార్లు రూ.2వేల వరకు లావాదేవీలు జరపవచ్చు. అత్యంత వేగంతో అనేక చిన్న UPI లావాదేవీలకు అవకాశం కల్పిస్తుందని.. ఇలాంటి సౌకర్యం ఉన్న ఏకైక కంపెనీ తమదేనని పేటీఎం వెల్లడించింది.
UPI లైట్ సర్వీసులకు ప్రస్తుతం కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC, ఇండియన్ బ్యాంక్, కోటక్ మహీంద్ర, SBI, UBI, PNB బ్యాంకులు తమ మద్దతు తెలిపాయి. లావాదేవీ చేసిన ప్రతిసారి బ్యాంకుల నుంచి SMS, పేటీఎం హిస్టరీ కూడా ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా UPI లైట్ యాక్టివేట్ చేసుకున్న వినియోగదారులకు రూ.100 క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అందిస్తుంది.