YS Avinash Reddy | తనకు తెలిసిదంతా సీబీఐ విచారణలో చెప్పానని వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తెలిపారు. మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ఎదుట ఆయన హాజరయ్యారు. దాదాపు ఐదు గంటల పాటు అవినాశ్ ను అధికారులు విచారించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన అవినాశ్ రెడ్డి.. ఓ వ్యక్తి టార్గెట్ గా సీబీఐ విచారణ జరుగుతోందని వెల్లడించారు. మీడియాకు మనవి చేస్తున్నా.. తప్పుడు వార్తలు రాయకండి.. వాస్తవాలను రాయండని చెప్పారు. గతంలో విజయమ్మ గారిని కలిస్తే బెదిరించటానికి వెళ్లానని ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసమని పేర్కొన్నారు. ఇలాంటి వార్తలు దర్యాప్తు సంస్థల విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. గూగుల్ టేక్ ఔట్ అంటున్నారు.. గూగుల్ టేక్ ఔటో.. టీడీపీ టేక్ ఔటో కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా తనకు తెలిసిందే చెబుతానని అవినాశ్ రెడ్డి(YS Avinash Reddy) స్పష్టంచేశారు.