Constable Rajashekar | ఈ మధ్యకాలంలో ఉన్నచోటే ఒక్కసారిగా మనుషులు కుప్పకూలిపోవడం తరుచుగా చూస్తున్నాం. ఇలా పడిపోయినప్పుడు వెంటనే CPR చేస్తే వారు బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని ఆరాంఘడ్ చౌరస్తాలో బాలరాజు అనే వ్యక్తి ఉన్నట్టుండి కింద పడిపోయాడు. ఇది గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్.. వెంటనే అతనికి CPR చికిత్స అందించాడు. దీంతో ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా అతను క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఈ వీడియో వైరల్ కావడంతో అందరూ కానిస్టేబుల్ చర్యను అభినందిస్తున్నారు. మంత్రి హరీష్ రావు కూడా కానిస్టేబుల్ రాజశేఖర్ ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతుండడంతో ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు CPR శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.