Nara Lokesh | సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) గురించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. రాజకీయాల్లోకి రావాలంటే మొదట మంచి మనస్సు కావాలన్నారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండాలని కోరుకునే వారందరూ రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి కూడా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లోనే పవన్ కల్యాణ్ లో మంచి మనస్సు చూశానని తెలిపారు. కాగా పాదయాత్రలో భాగంగా తిరుపతిలో యువతతో పాటు ఆటోడ్రైవర్లతో లోకేష్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు.
Read Also: అన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది: అవినాష్ రెడ్డి