Royal Enfield Bikes |యువకుల డ్రీమ్ బైక్.. రాయల్ ఎన్ ఫీల్డ్. బుల్లెట్ బైకులకు యూత్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతి యువకుడు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను కొనాలనుకుంటాడు. అంత క్రేజ్ ఉన్న ఈ బైకులను ఆ కంపెనీ సరికొత్త మోడ్రన్ లుక్ లో తీసుకొస్తోంది. ‘ఇంటర్ సెప్టార్’, ‘కాంటినెంటల్ జీటీ’ మోడల్స్ రెట్రో లుక్ మార్చకుండానే కొత్త హంగులతో తీర్చిదిద్దింది. ఈ మోడల్స్ లో తొలిసారిగా అల్లాయ్ వీల్స్ అమర్చింది.
ఇంటర్ సెప్టార్ లో బార్సిలోనా బ్లూ, బ్లాక్ రే.. కాంటినెంటల్ GTలో అపెక్సో గ్రే, స్లిప్ స్ట్రీమ్ బ్లూ కలర్స్ మోడల్స్ ను రిలీజ్ చేసింది. LED హెడ్ ల్యాంప్, USB చార్జింగ్ పోర్ట్ అమర్చింది. సూపర్బ్ లుక్స్ తో ఉన్న ఈ బైక్ లు త్వరలోనే భారత మార్కెట్లలోకి తీసుకొచ్చేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇంటర్ సెప్టార్ 650 మోడల్ ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర 2.81 లక్షలు, కాంటినెంటల్ GT ధర 3.05 లక్షలుగా ఉండొచ్చని సమాచారం.