26.2 C
Hyderabad
Monday, December 2, 2024
spot_img

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై పవన్‌ సీరియస్‌

కాకినాడలోని యాంకరేజ్‌ పోర్టు నుంచి రేషన్‌ బియ్యం ఇంత భారీగా అక్రమ రవాణా జరుగుతుంటే ఏం చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు వచ్చి అక్రమ రవాణాను ఆపితేకానీ.. చర్యలు చేపట్టరా? అని నిలదీశారు. బియ్యం అక్రమ రవాణా వ్యవహారం నేపథ్యంలో కాకినాడ పోర్టులో ఆయన తనిఖీలు చేపట్టారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి బోటులో సముద్రం లోపలికి వెళ్లి పరిశీలించారు.

రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో సముద్రం లోపల సుమారు 9 నాటికల్ మైళ్ల దూరంలో రవాణాకు సిద్ధమై పట్టబడిన నౌకలో 640 టన్నుల బియ్యాన్ని పవన్‌ స్వయంగా వెళ్లి చూశారు. పశ్చిమ ఆఫ్రికా దేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జ్‌లో బియ్యాన్ని‌ పరిశీలించారు. కాకినాడ పోర్టు నుంచి ఈ స్థాయిలో బియ్యం అక్రమంగా రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. డీఎస్పీ రఘువీర్‌ విష్ణువు, ఎమ్మెల్యే కొండబాబును నిలదీశారు. దీని వెనుక ఎంతటి వారున్నా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.

Latest Articles

కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స ఫైర్

కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైన.. ఎన్నికల్లో హామీలేవీ నెరవేర్చలేదని మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖపట్నంలో బొత్స మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులకు పొంతన లేదని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్