ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు

పాక్‌- అఫ్గాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్‌ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులతో సహా 15 మంది మృతి చెందారు. బార్మల్‌ జిల్లాలో పక్తికా ప్రావిన్స్‌లోని ఏడు గ్రామాలు లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ దాడులకు పాకిస్థాన్ యుద్ధ విమానాలే కారణమని స్థానికులు ఆరోపించారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. వజీరిస్థానీ శరణార్థులే ఎక్కువగా మరణించినట్లు చెప్పారు.

మరోవైపు ఈ చర్యను తాలిబన్ రక్షణ మంత్రిత్వశాఖ ఖండించింది. దీనికి ప్రతికారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. సరిహద్దు సమీపంలోని తాలిబన్ రహస్య స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామని భద్రతా వర్గాలు తెలిపాయి. అయితే, ఈ దాడులు తామే చేశామని పాక్‌ ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇటీవల తమ దేశంలో జరిగిన పలు ఉగ్రదాడులకు తాలిబన్లే కారణమని పాక్ ఆరోపించింది. ఈ ఆరోపణలను తాలిబన్‌ ఖండించింది. ఈక్రమంలో పాక్‌ వైమానిక దాడులు చేయడంతో ఉద్రిక్త పరిస్థులు నెలకొన్నాయి.

Latest Articles

తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత

తిరుపతి జిల్లా: తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్