Free Porn
xbporn
23.2 C
Hyderabad
Thursday, July 25, 2024
spot_img

ఒక్కసారి మొక్క నాటితే ఎనభై ఏళ్ల పంట

   ఎడారికి పరిమితమైన ఖర్జూర తెలంగాణకు చేరింది. ఒక్కసారి మొక్క నాటితే చాలు.. 80 ఏళ్ల పాటు పంట దిగుబడితో కాసుల వర్షం కురుస్తుందంటున్నారు ఖర్జూర రైతులు. మరి ఆ పంట సాగు పద్దతు లేంటో..? దిగుబడి ఏ మేర వస్తుందో… లాభ నష్టాల మాటేంటో తెలుసుకుందాం.

ఎడారి ప్రాంతాలకే పరిమితం అనుకున్న ఖర్జూర పంట తెలంగాణలోనూ విస్తరిస్తోంది. రామాయంపేటకు చెందిన రైతు సత్యనారాయణ 13 ఎకరాలలో ఈ పంటను సాగుచేస్తున్నాడు. ఖర్జూర మొక్కలే కాకుండా 50 రకాల పళ్ళ మొక్కలు కూడా సాగు చేస్తున్నాడు. డ్రిప్ సిస్టం, మల్చింగ్ ద్వారా తక్కువ నీటితో ఈ పంటను సాగుచేస్తున్నట్టు చెబుతున్నాడు. నాలుగేళ్ల క్రితం నాటిన కొన్ని మొక్కలకు ఖర్జూర గెలలు వేయడంతో ఆనందరం వ్యక్తం చేస్తున్నాడు. ఇండోనేషియా నుండి ఖర్జూర పంటను ఇవ్వాలని అక్కడి వ్యాపారులు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ మెదూక్‌ ప్రాంత వాసులకే ఖర్జూరం ముందుగా అందిస్తానని.. ఆ తర్వాతే వ్యాపారం చేస్తానని చెబుతున్నాడు. ఒక్కసారి ఈ మొక్కలు నాటితే 80 సంవత్సరా ల వరకు దిగుబడి వస్తుందని రైతులకు ఆశాజనకమైన పంట అని సూచిస్తున్నాడు. ఇకపోతే 90 శాతం ఫిమేల్ మొక్కలు 10 శాతం మేల్ మొక్కలు నాటిన తర్వాత జనవరి మాసంలో ఖర్జూర మొక్కలకు పూత ప్రారంభ మవుతుంది. ఈసమయంలో మేల్ ఖర్జూర మొక్కల పువ్వుల నుండి పుప్పడి రేణువులను ఫిమేల్ మొక్కల పువ్వులకు అందిస్తారు. ఆ తదుపరి ఫలదీకరణం చెంది ఖర్జూర గెలలు వేసి పంట దిగుబడిని అందిస్తాయి. సత్యనారాయణ సాగుచేస్తున్న ఖర్జూర పంటలో అంతర్‌పంటగా ఇతర పళ్ళ మొక్కలు నాటారు. క్యాన్సర్ వ్యాధి చికిత్సలో, ఆయుర్వేదంలో ఉపయోగించే లక్ష్మణ సీతాఫలం చెట్లు కూడా ఈ ఫామ్ లో ఉండడం విశేషం. పూర్తి స్థాయి సేంద్రియ పద్దతి, గోఆధారిత పద్దతిలోనే ఈ పంటలను పండి స్తున్నారు. ఇందుకోసం ఫామ్‌లో గిరి ఆవులను పెంచుతున్నారు. సేంద్రియ ఎరువులను సూక్ష్మ పోషకాల ను అందిస్తూ కంటికి రెప్పలా ఖర్జూర వృక్షాలను కాపాడుతున్నారు. 2019లో ఎలైట్, బర్గి రకాల ఖర్జూర పంటను సాగు చేయగా ఈ ఎడాది ఖాతా ప్రారంభమైంది.

ప్రత్యేకంగా సాగు చేస్తున్న ఈ ఖర్జూర ఫామ్‌ను జిల్లా వ్యవసాయ హార్టికల్చర్ అధికారి నరసయ్య, మండల హార్టికల్చర్ ఆఫీసర్లు సందర్శించి తగు సూచనలు సలహాలు అందిస్తున్నారు. అలాగే కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు డాక్టర్ సంబాజీ నల్కర్, డాక్టర్ శ్రీకాంత్‌ పంట సాగు మెళకువలను తెలియజేస్తున్నారు. ఖర్జూర పంట మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలలో ఎక్కవగా సాగు చేస్తారు. ఇండియాలో రాజస్థాన్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలలో సాగు చేయగా, ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లోనూ మక్కువ చూపిస్తు న్నారు. ఎడారి దేశాలైన అరబ్ దేశాల్లో పండే ఈ ఖర్జూర పంటకు పెట్టుబడుల ఖర్చు ఎక్కువగా ఉన్నప్ప టికీ మూడు నుండి నాలుగు సంవత్సరాలలో పంట చేతికి వస్తుంది. ఒకసారి మొక్కలు నాటితే దాదాపు 80 ఏళ్ల పాటు పంట దిగుబడి వస్తుండడంతో ఖర్జూర సాగుపై రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.

Latest Articles

ట్రెండింగ్‌లో సుధీర్ బాబు ‘హరోంహర’

సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించిన చిత్రం ‘హరోం హర’. యాక్షన్‌ డ్రామాగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ఓటీటీలో అలరిస్తోంది. ఏకంగా మూడు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. ఈటీవీ విన్‌, ఆహాలతో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్