26.2 C
Hyderabad
Saturday, July 13, 2024
spot_img

రేవంత్ సర్కార్ కు సవాల్ గా మారిన స్థానిక సంస్థల ఎన్నికలు

   పంచాయతీల్లోనే అనుకుంటే మండల, జిల్లా పరిషత్‌లలోనూ ప్రత్యేక అధికారుల పాలన మొదలుకా నుంది. తెలంగా ణ వ్యాప్తంగా ఉన్న ఎంపీపీలు, జెడ్పీ చైర్‌ పర్సన్ల పదవీ కాలం ఈనెల 3, 4 తేదీల్లో ముగియనుండగా ఇకపై అధికారుల కనుసన్నల్లో స్థానిక పాలనంతా సాగనుంది. దీంతో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడున్న అంశం చర్చకు వస్తోంది. అయితే కులగణన అనంతరం బీసీ రిజర్వేషన్ల పై నిర్ణయం తీసుకోవాలని రేవంత్ సర్కారు భావిస్తుండ డంతో స్థానిక సంస్థలు కొలువు తీరేది వచ్చే ఏడాదేనన్న వాదన విన్పిస్తోంది.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా కులగణన, బీసీ రిజర్వేషన్ల అంశం తేలాకే ఎన్నికలు నిర్వహిం చాలని రేవంత్ రెడ్డి సర్కారు భావిస్తుండడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో రాష్ట్రంలో గ్రామ పంచాయతీల మాదిరిగానే మండల, జిల్లా పరిషత్‌లలోనూ ప్రత్యేక అధికారుల పాలన సాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీపీలు, జెడ్పీ ఛైర్‌ పర్సన్‌ల పదవీకాలం ఈనెల 3, 4 తేదీల్లో ముగియనుంది. దీంతో ఆయా సభ్యుల స్థానంలో స్పెషలాఫీసర్ల పాలన రానుంది. జిల్లా పరిషత్‌లకు కలెక్టర్లను, మండల పరిషత్‌లకు జిల్లా స్థాయి అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయనుంది. 2019 మే నెలలో 539 జడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అదే ఏడాది జులై మూడో తేదీన మండల పరిషత్‌లకు పాలకవర్గాలు ఏర్పడ్డాయి. అధ్యక్ష, ఉపాధ్యక్షుల తోపాటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. జులై నాలుగో తేదీన 28 జిల్లా పరిషత్‌లకు ఆగస్ట్ 7న ములుగు, మహబూబా బాద్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జడ్పీలకు ఛైర్‌ పర్సన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్లు, సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ సర్పంచ్‌ల పదవీ కాలం ఫిబ్రవరిలోనే పూర్తైంది. అయితే.. మొన్నటి వరకు పార్లమెంటు ఎన్నికల హడావిడి ఉండడంతో స్థానిక సమరం దిశగా ప్రభుత్వం దృష్టి సారించడానికి కుదరని పరిస్థితి. ఇప్పుడు అవి కూడా పూర్తైపోవడంతో పంచాయతీ ఎన్నికల వ్యవహారం పై మెల్లగా దృష్టి సారిస్తోంది ప్రభుత్వం. వాస్తవానికి రాజ్యాంగంలోని 73వ సవరణ చట్టం ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఓసారి పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలి. సాంకేతిక కారణాలు, రాజకీయ పరమైన కారణాలతో ఎలక్షన్లు వాయిదా వేస్తే కేంద్రం నుంచి ఆయా గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు నిలిచిపోతాయి. ఫలితంగా స్థానిక సంస్థల అభివృద్ధి కుంటుపడుతుంది. చివరకు ఆ ప్రభావం అంతా రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుంది.ఇలాంటి వేళ కాంగ్రెస్‌ పార్టీలో కొత్త చర్చ మొదలైంది. అదే రిజర్వేషన్ల అంశం. అవును ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవు తోంది. ఇందుకు కారణం తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీయే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన హస్తం పార్టీ.. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీనిచ్చింది. దీంతో.. పెద్ద ఎత్తున బీసీల ఓట్లు కాంగ్రెస్‌ పార్టీకి పడడం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చకచకా జరిగి పోయాయి. ఇక, పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా సీఎం రేవంత్ రెడ్డి పాలన ప్రారంభించారు. ఇచ్చిన హామీ మేరకు బీసీలకు సంబంధించి కులగణన చేసేందుకు అసెంబ్లీలో తీర్మానించారు. కానీ, ఇంతలోనే లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు రావడం, ఎలక్షన్ కోడ్ కారణంగా కులగణన ప్రారంభం కాలేదు. దీంతో.. ఇప్పుడు మళ్లీ ఆ దిశగా ఆశలు చిగురిస్తున్నాయి.

వాస్తవానికి గత బీఆర్ఎస్ హయాంలో ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని మొదట ఆలోచించింది రేవంత్ సర్కారు. గతంలో పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉండేవి. అయితే మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి కుదిస్తూ నాటి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారాన్ని సవాలు చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం వచ్చే పంచాయతీ ఎన్నికలలోపు రిజర్వేషన్ల లెక్కలను తేల్చాలని ఆదేశించింది. ఇందుకు అనుగుణంగానే బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో 42 శాతానికి పెంచుతామంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీనిచ్చింది. ఇప్పుడు హస్తం పార్టీ అధికారంలోకి రావడంతో పాత పద్దతి అమలు చేస్తే తమకు అన్యాయం జరుగు తుందని బీసీ సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో  కులగణన చేసిన తర్వాతే రిజర్వేషన్ల అంశం జోలికి వెళ్లాలని తెలంగాణ సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో మొత్తం 12 వేల 814 గ్రామ పంచాయతీలు, 88 వేల 682 వార్డులున్నాయి. 620 జడ్పీటీసీ స్థానాలు, 6473 ఎంపీటీసీ స్థానాలు న్నాయి. అయితే గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహిస్తారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మాత్రం పార్టీ గుర్తుతో జరుపుతారు.హైదరాబాద్ మినహా తెలంగాణ అంతటా స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. వార్డులు, గ్రామ పంచాయతీల ఎన్నికలు ఒకసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిక లు మరోసారి జరపాలి. ఉప సర్పంచులకు పరోక్ష ఎన్నికలు ఉంటాయి. మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరిపిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మొత్తంగా చూస్తే స్థానిక సంస్థ ల ఎన్నికల నిర్వహణ రేవంత్ సర్కారుకు కత్తిమీద సాములా మారిందన్న అభిప్రాయం వ్యక్తమ వుతోంది.

Latest Articles

నిరుద్యోగులను కేటీఆర్‌ తప్పుదోవ పట్టిస్తున్నారు – చనగాని దయాకర్

నిరుద్యోగులను తప్పు దోవ పట్టిస్తున్న కేటీఆర్.. గన్ పార్క్ వద్ద ముక్కు నేలకు రాయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్