స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి మేలు చేయాలన్న తపనతో తాను పని చేస్తున్నానని.. ప్రతి అనగారిన కుటుంబాన్ని, సామాజిక వర్గాన్ని నా కుటుంబం అనుకుంటున్నానని సీఎం జగన్ అన్నారు. పేదలకు మేలు జరుగుతుంటే ప్రతిపక్ష పార్టీలు తట్టు కోలేక పోతున్నాయిని మండిపడ్డారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు పేదలు గుర్తుకువస్తారని ఎద్దేవా చేశారు. గత పాలనలో ఎస్సీలకు, బీసీలకు అన్యాయం జరిగింది.. నేను చేసిన మంచిని, ప్రజలని, దేవుడిని నమ్ముకుంటే.. చంద్రబాబు, దత్త పుత్రుడు పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులు నమ్ముకున్నారని అన్నారు. చంద్రబాబుతో సహా టీడీపీ వెంటిలేటర్ మీద ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దత్త పుత్రుడు రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా ప్రజలు నమ్మలేదు. దండం పెట్టి పంపారు.. ఒక్కో ఎన్నికకు ఒక్కో రేటు పెట్టి పార్టీని అమ్ముతున్న ప్యాకేజ్ స్టార్‌కు సీఎం పదవి అవసరం లేదంట. బీజేపీతో, కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకునేది వీళ్లే.. విడిపోయేది వీళ్లే.. పెళ్లిళ్లు చేసుకునేది.. విడాకులు ఇచ్చేది వీళ్లే.. చంద్రబాబు ఏం చెబితే దానికి తల ఆడించడం ఒక్కటే దత్త పుత్రుడికి తెలిసింది అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు జగన్.
చంద్రబాబుతో సహా టీడీపీ వెంటిలేటర్ మీద ఉంది: సీఎం జగన్
0
398
Previous article
Next article
Latest Articles
సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?
క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -
- Advertisement -


