ఎర్రోల్ మస్క్.. బిలయనీర్ ఎలన్ మస్క్ తండ్రి. తాజాగా అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా జెండర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిల డ్రెసులు వేసుకునే ఆమె.. అతను అని అన్నారు. అంతేకాకుండా ఆమె భర్త మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ” గే” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఆన్‌లైన్‌లో హాస్యాస్పదమైన వాదనలు చేయడంలో ఎర్రోల్ మస్క్ ప్రసిద్ధి.
“ఒబామా .. మహిళల దుస్తులు ధరించే పురుషుడిని వివాహం చేసుకున్న “గే” అని మేము గ్రహించాము. మనందరికి కూడా ఆ విషయం తెలుసు. ” అని ‘వైడ్ అవేక్ పోడ్‌కాస్ట్’లో జాషువా రూబిన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎర్రోల్ చెప్పాడు.
ఎర్రోల్ మాటలకు షాక్ అయిన హోస్ట్ ” మిచెల్ ఒబామా పురుషుడా..?” అని అడిగారు. వెంటనే ఎర్రోల్ మాట్లాడుతూ.. అవును ఈ విషయం మీకు తెలియదు. అన్నారు.
అతను 2014 లో వైరల్ అయిన ఒక కుట్ర సిద్ధాంతాన్ని ఉదహరించాడు. “హాస్యనటి జాన్ రివర్స్ మాజీ ప్రథమ మహిళ జెండర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బరాక్ ఒబామా “గే” అని కూడా ఆయన ఆరోపించారు”అని అన్నారు.
“జాన్ రివర్స్ దీన్ని బహిరంగంగానే చెప్పారు.. అయితే ఆమె రెండు వారాల తర్వాత మరణించారనుకోండి. ” ఎర్రోల్ అన్నారు.
జాన్ రివర్స్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొన్ని వారాలకు అంటే 2024, సెప్టెంబర్ 4న మృతి చెందారు. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు లేవు.