న్యూఇయర్‌ వేడుకల్లో అశ్లీల నృత్యాలు… జనసేన నేత నిర్వాకం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో న్యూ ఇయర్‌ వేడుకలకు సంబంధించిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గొల్లపుంత రోడ్ లో ఉన్న బుద్ధా స్టాట్యూ ఓం సిటీ లేఔట్‌లో అశ్లీల నృత్యాలతో కొత్త సంవత్సర వేడుకలను నిర్వహించారంటూ వీడియోలు బయటకు వచ్చాయి.

రేవ్ పార్టీని తలపించేలా మండపేట నడిబొడ్డులో అసాంఘిక నృత్యాలతో జనసేన నాయకుడు పార్టీ నిర్వహించాడు. వేలు పూరి ముత్యాలరావు అలియాస్ ముత్తు 31 రాత్రి వేడుకలు నిర్వహించాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో…. జనసేన నాయకుడితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు మండపేట టౌన్ పోలీసులు. ఈ వ్యవహారంలో జనసేన నాయకులు ఉండటంతో వాళ్లపై కేసు నమోదు చేయొద్దు అంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం.

Latest Articles

బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటే రేవంత్ రెడ్డి భయపడుతున్నారా?

రాజకీయాల్లో ఎంత కష్టపడి అధికారం సాధించామో, దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్ముకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యంత్రాంగానికి గట్టి హెచ్చరికలే జారీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్