నేడు హైదరాబాద్‌కు NSDA అధికారులు

    కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించడానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ నేడు రాష్ట్రానికి రానుంది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ, మరమ్మ తులు చేపట్టడానికి వీలుగా వాటి నిర్మాణం, లోపాలపై అధ్యయనం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 13న తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి NDSAకు లేఖ రాశారు. ఈ క్రమంలో ఈ నెల 2న కేంద్ర జలవన రుల సంఘం మాజీ ఛైర్మన్‌ జె.చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో ఆరుగురితో ప్రభుత్వం కమిటీ వేశారు. ఈ కమిటీ హైదరాబాద్‌కు చేరుకున్నాక మధ్యాహ్నం జలసౌధలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఇతర అధికారులతో ఎన్డీఎస్‌ఏ కమిటీ సమావేశం కానుంది.

    రేపు, ఎల్లుండి తేదీల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనుంది. మళ్లీ 9వ తేదీన హైదరాబాద్‌ లో నీటిపారుదల శాఖ అధికారులతో పాటు ఆయా బ్యారేజీల నిర్మాణంలో పాలుపంచు కున్న అధికారులు, నిర్మాణ సంస్థలతో సమావేశం కానుంది. ఆ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో బ్యారేజీల ప్లానింగ్‌, డిజైన్లు, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్‌, ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ అధికారులు తమ వెంట ఉండేలా చూడాలని సర్కారును కోరింది. మేడిగడ్డ కుంగుబాటుపై కమిటీ విచారణ చేపట్టనుంది.

Latest Articles

వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే

ఒకరు 90 ఏళ్లు దాటిన వయసులో, మరొకరు 70 ఏళ్లు దాటిన వయసులో సినిమాలు తెరకెక్కించి విడుదలకు సిద్ధం చేశారు. తెలుగు సినిమా సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్