స్వతంత్ర వెబ్ డెస్క్: శ్రీశైలం మల్లన్న భక్తుల కోసం వడ ప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది శ్రీశైలం దేవస్థానం. ఇప్పటివరకు పులిహోర, లడ్డు మాత్రమే భక్తులకి అందుబాటులో ఉండగా.. నేటి నుంచి వడ ప్రసాదం కూడా భక్తులకి అందుబాటులో ఉండనుంది. 45 గ్రాముల వడ 20 రూపాయల ధరతో భక్తులకు దేవస్థానం విక్రయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. శ్రీస్వామి అమ్మవార్లకు పూజాదికాలు చేసి వడ ప్రసాదం శ్రీశైలం ఈవో లవన్న ప్రారంభించారు. మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ప్రసాద కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని ఈవో లవన్న తెలిపారు.
మల్లన్న భక్తులకి గుడ్ న్యూస్
0
283
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


