33.2 C
Hyderabad
Tuesday, May 5, 2026
spot_img

పశ్చిమ బెంగాల్‌లో ఈ నెల 9న కొత్త ప్రభుత్వం ఏర్పాటు.. సీఎం రేసులో ఎవరున్నారంటే?

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. ఈ నెల 9న బెంగాల్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జయంతి సందర్భంగా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్‌లో సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. బీజేఎల్పీ సమావేశంలో సీఎంను ప్రకటించనుంది హైకమాండ్. సీఎం రేసులో సువేందు, దిలీప్‌ ఘోష్‌, సామిక్‌ భట్టాచార్య, నిసిత్‌ ప్రమాణిక్ ఉన్నారు.

సువేందు అధికారితో పాటు పలువురు నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో సువేందు అధికారి, పలువురు నేతలు ఢిల్లీకి పయనమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా, నితిన్‌ నబీన్‌తో ప్రభుత్వ ఏర్పాటుపై ఢిల్లీలో కీలక భేటీలు జరగనున్నాయి. సీఎం, డిప్యూటీ సీఎం, కేబినెట్‌ బెర్త్‌లను హైకమాండ్‌ ఫైనల్‌ చేయనుంది. బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీ 206 స్థానాల్లో గెలిచి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది.

Latest Articles

హీరో ప్రభాస్ ఫౌజీ మూవీ టీమ్‌లో విషాదం.. షూటింగ్‌కు వెళ్తుండగా వాహనానికి ప్రమాదం.. ఒకరు మృతి

హీరో ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ బృందం వెళ్తున్న వాహానం ప్రమాదానికి గురైంది. ఈరోజు షూటింగ్‌కు వెళ్తుండగా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద వాహనం అదుపుతప్పి డివైడర్ సిమెంట్ దిమ్మెలను ఢీకొట్టింది. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్