ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్ పాల్ తప్పించుకోవడంపై హైకోర్టు సీరియస్

ఖలిస్థానీ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్(Amritpal Singh) తప్పించుకుపోయిన వ్యవహారంలో పోలీసుల తీరుపై పంజాబ్, హర్యానా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమృత్‌పాల్‌ సింగ్‌ తప్పించుకోవడం రాష్ట్ర పోలీసుల నిఘా వైఫల్యమేనని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ ఆపరేషన్‌కు సంబంధించి ప్రస్తుత పరిస్థితిపై నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. 80 వేల మంది పోలీసులు ఉన్నారని.. అయినా అమృత్ పాల్ సింగ్(Amritpal Singh) ఎలా తప్పించుకున్నాడని పంజాబ్ ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. మరోవైపు ఇప్పటిదాకా 120 మందిని అరెస్టు చేశామని పోలీసులు కోర్టుకు తెలియజేశారు.

అటు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ స్పష్టంచేశారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ ఒక్కరిని వదిలిపెట్టమని ఆయన హెచ్చరించారు.

Read Also: ఫుట్ ఓవర్ కింద ఇరుక్కుపోయిన పెట్రోల్ ట్యాంకర్.. భయాందోళనలో స్థానికులు

Follow us on:   Youtube   Instagram

Latest Articles

వరంగల్ మేయర్‌ పీఠంపై బండి సంజయ్‌ ఫోకస్‌.. జీహెచ్‌ఎంసీలో ప్రచారం లేనట్టేనా?

హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్