Corona Cases |దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రత్తమైంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నట్లు గుర్తించింది. దీంతో ఆయా రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వచ్చే సోమవారం రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. అలాగే ఏప్రిల్ 10,11 తేదీల్లో మాక్ డ్రిల్ కూడా చేపట్టనుంది. కాగా దేశంలో ఇవాళ కొత్తగా 1,590 కరోనా కేసులు నమోదవ్వగా.. ఆరుగురు మృతి చెందారు. దాదాపు 146 రోజుల తర్వాత ఒకేరోజు అత్యధిక కేసులు నమోదవడం ఇదే తొలిసారి. గత ఐదువారాల్లో దేశంలో కేసులు తొమ్మిది రెట్లు పెరిగాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16గా భావిస్తున్నారు.
Read Also: అలా బతకడం కన్నా చావడానికైనా సిద్ధమంటున్న మంచు మనోజ్
Follow us on: Youtube Instagram