Komatireddy Venkat Reddy |కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని ఖండించారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అనర్హత వేటును నిరసిస్తూ యాదాద్రి జిల్లా బొమ్మలరామారంలో ఆందోళనకు దిగారు. రాహుల్ పై వేటుకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ఎంపీగా అనర్హత వేటు వేయడం దుర్మార్గమని మండిపడ్డారు. మార్చి 23న ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని అన్నారు. రాహుల్ వెంట తామంతా ఉంటామని.. అవసరమైతే పదవులకు రాజీనామా కూడా చేస్తామన్నారు. దేశమంతటా చేపట్టిన భారత్ జోడో యాత్రలో కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొన్నారని అన్నారు. ఈ పాదయాత్రలో రాహుల్ ఎక్కడ కూడా రాజకీయాల గురించి మాట్లాడలేదని అన్నారు. ఎన్నికల సమయంలో రాహుల్ ఒక మాట అంటే దానిమీద కోర్టు తీర్పు ఇచ్చిందని.. నెల రోజుల సమయం ఇచ్చి వెంటనే స్పీకర్ అనర్హత వేటు వేయడం సరికాదని మండిపడ్డారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోమటిరెడ్డి(Komatireddy Venkat Reddy) డిమాండ్ చేశారు.
Read Also: దేశంలో కరోనా అలజడి.. హైఅలర్ట్ ప్రకటించిన కేంద్రం
Follow us on: Youtube Instagram